Sunday, 26 April 2015

చల్ల చల్లని మజ్జిగ :
       
             వేసవి తాపాన్ని తీర్చుకోవడం కోసం చాలామంది . కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు . కాని దాహం మాత్రం తీరదు . 
ఈ వేసవిలో మనకు తాపం తీరాలన్న , మన శరీరం లో వేడి తగ్గాలన్న మనం తగవలసింది మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు . 

              
మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి. 

* ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. 

* వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.

* వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేంచిన కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 

* కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
**మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జలోదరం (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.

* మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.

* పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.

* దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది.

* రక్తస్రావంతో కూడిన అర్శమొలకు వెన్న తొలగించిన మజ్జిగ తీసుకోవాలి. లేదా మజ్జిగలో ఉప్పు, వాముపొడి కలిపి తీసుకోవాలి. అలాగే మరో మంచి చికిత్స ఉంది. చిత్రమూలం వేరు బెరడును ముద్దగా దంచాలి. ఈ పేస్టును కుండలోపల పూసి, దానిలో మజ్జిగ చేసుకొని తాగాలి.

* పిప్పళ్లను వర్ధమాన యోగం రూపంలో మజ్జిగతో వాడాలి. అంటే పిప్పళ్లను పది రోజుల వరకూ రోజుకొకటి చొప్పున పెంచి తిరిగి తగ్గించుకుంటూ రావాలి.

* మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.

* చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్‌ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.

* సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

* వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత పసుపుచేర్చి తీసుకోవాలి.

* ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.

* విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.

* మల ద్వారం చుట్టూ దురదకు మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీనివల్ల మలంలోని ఆమ్లత్వం తగ్గి దురద తగ్గుతుంది.

* నులిపురుగులకు మజ్జిగలో వాయువిడంగాల చూర్ణం కలిపి తీసుకోవాలి.

* మాంసాహారం అరుగుదలకు మజ్జిగలో మాంసపు ముక్కలను నానేసి ఉడికించాలి. మజ్జిగలో ఊరటంవల్ల మాంసంలోని తంతువులు మార్ధవంగా తయారవుతాయి.

* పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.

*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.

Friday, 24 April 2015


Wipro Freshers Mega Walk in Drive - 24th April to 30th April 2015

skills : Finance and Accounting Process ( Non - Voice )

Education : BCom /BBA/M.Com/BCS/BBM

Experience : 0 to 1 year 

Location : Chennai

Last Date : 30th April 2015


Address;
Wipro
105, Annasalai, Gundai,
Chennai.



                       వేసవికాలం అనగానే సాధ్యమైనంతదాకా ఎవరైనా సరే నీడపట్టున ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఎండలలోని అతినీల లోహిత కిరణాల వల్ల చర్మంలోని మెరుపు తగ్గిపోయి, ముడుతలు వచ్చి, వార్ధక్యపు ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.
                       ముఖ్యంగా చర్మానికి హానిచేసేది మధ్యాహ్నపు ఎండ. చర్మానికి సహజంగా ఉండే సాగే గుణం, మృదుత్వాన్ని కూడా ఈ ఎండలోని కిరణాలు ధ్వంసం చేస్తాయి. పిగ్మెంటేషన్ తప్పదు, చర్మక్యాన్సర్ ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి, మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం శ్రేయస్కరం.