Sunday, 19 July 2015

గోదావరి పుష్కరాలు


  


            పాప ప్రక్షలనలో అతి పవిత్రమైన , ముక్యమైన పాత్ర పొసించెధి జలము . కేవలం ఒక్క నీటి బిందువు ఉన్న చాలు ప్రక్షాళన జరిగినట్లు బావిస్తాము . ఇంత గొప్ప ప్రసిస్తం మరే పంచ భుతాలకి లేదు . 


 గోదావరి మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా 

సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ 

మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత 

ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించిఆంధ్ర ప్రదేశ్ లోనికి

 ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా 

ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది.

గోదావరి నది చరిత్ర 
పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం
 ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు
 ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం 
పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. 
భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడం తో 
చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి 
ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును 
శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని 
పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన 
జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన 
పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, 
గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని 
వస్తారు.

ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా 
ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి 
శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు 
చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి 
ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు 
నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది 
మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం 
శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి 
లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి 
ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి 
స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ 
గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.


      పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.


నదిరాశి
గంగా నదిమేష రాశి
రేవా నది (నర్మద)వృషభ రాశి
సరస్వతీ నదిమిథున రాశి
యమునా నదికర్కాట రాశి
గోదావరిసింహ రాశి
కృష్ణా నదికన్యా రాశి
కావేరీ నదితులా రాశి
భీమా నదివృశ్చిక రాశి
పుష్కరవాహిని/రాధ్యసాగ నదిధనుర్ రాశి
తుంగభద్ర నదిమకర రాశి
సింధు నదికుంభ రాశి
ప్రాణహిత నదిమీన రాశి

బృహస్పతి (గురుడు)ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

కాని యిప్పుడు వచ్చిన ఈ గోదావరి పుష్కరాలు 144 సం . లకు వచ్చినది . 

పుష్కరుని చరిత్ర :

ఒకనోకపుడు  తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. 

Image result for lord shiva

ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.



Wednesday, 1 July 2015


నిదురించేటపుడు ఎడమచేతి వైపే ఎందుకు పడుకోవాలి ?

        మన ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ ఉంటె వాళ్ళు అంటారు , మనం వెల్లకిలా పడుకున్న , బోర్ల పడుకున్న, పక్కకు తిరిగి పడుకోమని , అది కూడా ఎడమ వైపు తిరిగి పడుకోమని . 


sleeping baby కోసం చిత్ర ఫలితం
           అప్పుడు మనం ఎందుకు అల పడుకోవాలి అని అంటే వారి దగర సమాధానం ఉండదు. మరి అల నిదురించేటపుడు ఎడమచేతి వైపే ఎందుకు పడుకోవాలో తెలుసా ???


           
             మనం ఆహారం తీసుకున్న కొద్దిసేపటి తర్వాత పడుకుంటాం. మనంతిన్న ఆహారం అరగాలంటే జీర్ణశక్తి మంచిగా ఉండాలి. మన శరీరంలోని శోషరస గ్రంథులు లతో పాటు జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమము కడుపుకు ఎడమవైపునే ఉంటాయి. మనం తిన్న వ్యర్థాన్ని బయటకొచ్చే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండాలంటే వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండాలి. అందుకే ఎడమవైపు పడుకోవటం మంచిదని డాక్టర్ల సలహా ఇస్తున్నారు. 

              ఇలా మనకు తెలీని ఎన్నో రహస్యాలు మన ఆయుర్వేదం లో చాల ఉన్నాయి . కొన్నింటికి logic లు ఉండవు ... అంతమాత్రాన అవి పనికి రానివి అనుకోవడం పొరపాటు .