గోరింటాకు పెట్టుకోవడం వలన ప్రయోజనాలు:-
గోరింటాకు , ఈ ఆకు తెలియని భారత వనిత ఉండదు అంటే అది అతిశయోక్తి కాదు . ఇప్పుడంటే గోళ్ళకి నైల్ పోలిషులు పెట్టుకుంటూన్నారు కానీ , ఒక్కప్పుడు రెండు చేతులకి చక్కగా గోరింటాకు పెట్టుకునే వారు . ఇప్పుడు కూడా హెన్న అనే దానితో ఏదో కొత్త కొత్త design పెట్టుకుంటూన్నారు అనుకోండి అది వేరే విషయం .
ఈ గోరింటాకు వలన చాల ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా ???
ఇది కేవలం అలంకారం కోసమే కాదు , ఇందులో చాల ఆయుర్వేదిక గుణాలు చాల ఉన్నాయి . అవి ఏమిటంటే ..... ఈ గోరింటాకు ను ఎక్కువగా వర్షాకాలం లో పెట్టుకోవాలి అంటారు .
ఎందుకంటే , ఆడవారంతా గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరం చల్లబడి వివిద రకాల క్రిముల వలన కలిగే సమస్యల నుండి గోర్లని, అరచేతుల్ని, అరికాళ్ళని కాపాడుకోవడం కొరకు ఆచరిస్తాం . అంతే కాకుండా ఈ కాలంలో కొత్త నీరు వస్తుంది దిని వలన కొత్తగా క్రిములు వస్తాయి . ఇవి ఎక్కువగా అర చేతులు , అరి కాళ్ళు నుండి శరీరం లోకి ప్రవేసిస్తాయి వీటి నుండి రక్షణకి , శరీరం లో వేడి తగ్గించడానికి గోరింటాకు ఎంతగానో ఉపయోగపడుతుంది . ఇది ఆడవారు మాత్రమే కాదు మగవారు పెట్టుకోవచ్చు . బయట shop లో దొరికే మెహంది కన్నా , గోరింటాకు లో ఉండే ఒసధి గుణాలు ఎక్కువ .

No comments:
Post a Comment