Saturday, 16 May 2015

వడ దెబ్బ Sun Stoke

వడ దెబ్బ :

            మాములుగా వేసవి కాలం లో చాలామంది వడదెబ్బ కు గురి అవుతూ ఉంటారు . వారి కోసం కొన్ని జాగ్రతలు .... శరీరంలో నీటి స్తాయి తగ్గడం వలన వడదెబ్బ కి గురి అవుతారు . 



  • సన్ స్ట్రొక్ అనగా, శరీరము అధిక ఉష్ణోగ్రత కి గురి అయినప్పుడు, ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరము లో శారీరక పరమైన, నాడీ వ్యవస్త పరమైన వ్యాధి లక్షనాలు కనపడటం..సాధారణం గా మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన (మెటబాలిజం) హీట్ జెనెరెట్ అవుతుంది.. అలా వుత్పత్తి అయిన “వేడి” మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడె అవయవాలు అయిన చర్మము ద్వారా చెమట(స్వెట్) వలన గాని బయటకు పంపబడుతుంది..కాని మన శరీరము అధిక ఉష్ణొగ్రత ల కి కాని, డీహైడ్రేషన్ కి కాని గురి ఐనప్పుదు, పైన చెప్పబడిన రక్షణ మార్గాలు(చర్మము , ఊపిరి తిత్తులు) సరిగా పని చెయవు..అందువలన మన శరీరపు ఉష్ణోగ్రత ఒక్కసారి గా 43″ డిగ్రీ సెంటి కి చేరుకుంటుంది.. ఇదే హీట్ స్ట్రోక్ .

  • సాధారణం గా హీట్ స్ట్రోక్ కి గురి అయ్యె అవకాశం యెక్కువ గా వుండే వాళ్ళు- చిన్న పిల్లలు (2 సం”ల లోపు), బాగా పెద్ద వాళ్ళు, క్రీడాకారులు, ఎక్కువగా ఒపెన్ స్తలాల లో పని చేస్తు ప్రత్యక్షం గా సూర్యరస్మి కి గురి అయ్యె వారు..


వ్యాది లక్షణాలు-

1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,

2. వాంతులు అవ్వడము,

3. నీరసం,

4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,

5. కనఫ్యూజన్, చిరాకు, స్థలము-సమయం తెలియక పోవడం,

వడ దెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు; 

  • ఒక గ్లాస్ మంచి నీటిలో 10  గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల  పిసికి వడ పోయాలి  . 

  • తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం  సిద్దమవ్తుంది .

  • దీనిని  వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే  వేసవి తాపాన్ని తట్టుకునే  శక్తీ పెరుగుతుంది .



వడ దెబ్బ - తగిలితే :


  • నీరుల్లిపాయల రసాన్ని  వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి. 
  • పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక 

కొబ్బరి నీళ్ళు గానీ  మెల్ల మెల్లగా కొద్ది  కొద్దిగ సేవింప చేయాలి .
  • చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా   బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా  మర్దన చేయాలి . 
  • అవకాశముంటే  మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి 

లేపనం చేయాలి ..
  • ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
  • యివి చేస్తూ 108 సర్వీస్ కి కాని, దగ్గర లో వున్న హాస్పిటల్ కి కాని తీసుకు వెల్లాలి..






నివారణ మార్గాలు-

1. తరచుగా చల్లని నీరు త్రాగడం,

2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…

3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .


4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .

5. మధ్యం సేవించకూడదు .

6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .


No comments:

Post a Comment